టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ రౌడీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఖుషి సినిమా. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇక యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని.. అటు సమంతా కి ఇటు విజయ్ దేవరకొండ కి కూడా మంచి బూస్ట్ ఇస్తుందని అందరూ అనుకున్నప్పటికీ అనుకున్న రీతిలో సూపర్ హిట్ మాత్రం కాలేదు ఖుషి మూవీ. అయితే ఇక ఖుషి సినిమా విడుదలైన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. జెర్సీ డైరెక్టర్ గౌతం తిననూరితో పాటు గీతగోవిందం దర్శకుడు పరశురాంతో కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిననూరి కాంబోలో  తెరకెక్కుతున్న సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది.


 ఈ సినిమా లో విజయ్ ప్రేక్షకులు ఎవరు ఊహించని పాత్ర లో కనిపించ బోతున్నారట. ఏకంగా కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడట. టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ ఈ విషయాన్ని ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో తెలియజేశారు. మురళీధర్ ఎస్సై పాత్ర చేస్తే.. విజయ్ కాంస్టేబుల్ రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉండబోతుంది అని ఖుషి మూవీ ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. మరి ఇక ప్రేక్షకులు ఊహించని కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఇక అభిమానులను ఎలా మెప్పించగలడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: