అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని బాదం ఆకుల విస్తరాకుతో రాశారు రమణ. సాక్షి రంగారావు, రాధాకుమారి బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటారని రమణ స్క్రిప్ట్ లో రాశారు. ఇక బాపు కూడా ఆ షాట్ ని అలాగే రాసుకోవడంతో.. నెక్స్ట్ రోజు షూటింగ్ కి బాదం ఆకుల విస్తర్లు తెప్పించమని ప్రొడక్షన్ వారికి చెప్పారు. అయితే ప్రొడక్షన్ బాయ్స్ కి బాదం ఆకులు దొరకపోవడంతో.. ఏ విస్తరు అయితే ఏముంది అనుకోని మామూలు విస్తరాకులు తీసుకు వచ్చేశారు. ఇక నెక్స్ట్ డే షూటింగ్ మొదలైన తరువాత బాదం ఆకుల విస్తర్లు కనిపించకపోవడంతో బాపు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదం ఆకుల విస్తర్లు దొరకలేదని ప్రొడక్షన్ టీం చెప్పిందట.
‘ఇంత పెద్ద హైదరాబాద్ లో ఏ ఇంటిలోనూ బాదం చెట్టు లేదా..? నాకు బాదం ఆకు విస్తర్లే కావాలి, వెళ్లి తీసుకురండి’ అని బాపు రెండు కారులు ఇచ్చి పంపించారు. అవి వచ్చేదాకా షూటింగ్ ఆపేశారు. అలా హైదరాబాద్ మొత్తం తిరిగిన ప్రొడక్షన్ టీం.. చివరికి ఎవరి ఇంటిలోనో ఉన్నాయని తెలుసుకొని వెళ్లి తీసుకొచ్చి ఎట్టకేలకు బాదం ఆకుల విస్తర్లు రెడీ చేశారు. దీంతో మార్నింగ్ జరగాల్సిన షూటింగ్ మధ్యాహ్నం మొదలయింది. అయితే ఇంత కష్టపడి తెచ్చిన బాదం ఇస్తర్లు సీన్ ని మూవీ నిడివి ఎక్కువ అవ్వడంతో సినిమా రిలీజ్ సమయంలో ఎడిటింగ్ లో తీసేశారు. ఇక ఈ సినిమాకు నిర్మాతలు కూడా బాపు రమణలే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి