ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ తో 'టాక్సీ వాలా' , సత్యదేవ్ తో 'తిమ్మరుసు' మరియు 'గమనం' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో గమనం అనే సినిమా తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చినవే. అంత సక్సెస్ అయినా కానీ ఈమెకి అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'భగవంత్ కేసరి' చిత్రం మాత్రమే ఉంది. అందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ కూడా కాదు, కేవలం చిన్న పాత్ర మాత్రమే పోషిస్తుంది.మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెని తమ సినిమాల్లో తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. దీనితో ఈమె ఇంస్టాగ్రామ్ లో అవకాశాల కోసం అందాలను ఇష్టమొచ్చినట్టు ఆరబోస్తుంది. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా తెగ చేసేస్తుంది, ఇవన్నీ చూసి అయినా ఆమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి