మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, నరేష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఓ కోలీవుడ్ రీమేక్ అని తెలుస్తుంది.. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా అనే సినిమా మంచి విజయం సాధించింది.బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తుది నామినేషన్స్లో ఆ సినిమా కు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకున్నది. అయితే సూపర్ హిట్ అయిన మండేలా సినిమా ఆధారంగానే మార్టిన్ లూథర్ కింగ్ రూపొందుతోన్నట్లు సమాచారం. పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.మరి ఈ సినిమాతో సంపూ మరో హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి