ప్రస్తుతం ఇండియన్  సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నార్త్ నుండి సౌత్ వరకు సినీ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ నయనతార అని చెప్పొచ్చు. హిట్స్ మీద హిట్స్ అందుకుంటూ ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో సైతం హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నాయనతార. దానితోపాటు ఒక్కొక్క సినిమాకి గాను భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది ఈ చిన్నది.

ఇటీవల వచ్చిన జవాన్ సినిమాకి గాను ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఒక్కొక్క సినిమాకి రేంజ్ లో వసూలు చేస్తున్న నయనతార ఆస్తులు సైతం బాగానే కూడా పెట్టింది అన్న సమాచారం వినబడుతోంది. అయితే తన సొంత ఊరిలోనే కాకుండా నయనతార కి హైదరాబాదులో సైతం కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే హైదరాబాదులో ఈ అందాల తారకి లగ్జరీస్ అపార్ట్మెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటి ఖరీదు ఒక్కొక్కటి 15 కోట్లకు పైగానే ఉంటుంది అని అంటున్నారు.

వాటిని తన అభిరుచులకి తగ్గట్టుగా అందంగా ఆకర్షణీయంగా ఉండేలాగా చాలా ఖర్చు చేసి మరి డిజైన్ చేయించుకుందుట. ఇంటి కోసం ఉపయోగించిన ఫర్నిచర్ డిజైనర్ మెటీరియల్ లైటింగ్ వంటి వాటి కోసం కోట్లల్లో ఖర్చు చేసిందట నయనతార. అంతేకాదు తన బిజీ షెడ్యూల్స్ లో రిలాక్స్ అవడం కోసం హైదరాబాదులో ఉన్న ఈ అపార్ట్మెంట్స్ కి నయనతార అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా తన సొంత ఊరిలోనే కాకుండా హైదరాబాదులో సైతం కోట్లు విలువ చేసే ఆస్తులను కూడా పెట్టింది నాయనతార. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే తనీ ఒరువన్ 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు టేస్ట్ లేడీ సూపర్ స్టార్ 2 వంటి సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలతో బిజీగా ఉంది నయనతార..!!

మరింత సమాచారం తెలుసుకోండి: