టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశమే హద్దుగా ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. 2024 సంవత్సరం ఏప్రిల్  5వ తేదీన తమకు పండుగ రోజు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే తెగ సంతోషిస్తున్నారు. అయితే దేవర సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. దేవర సినిమానాను థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ రాగా

 ఈ సినిమా రైట్స్ ఏకంగా 130 నుండి 140 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్లో దాదాపు సగం బడ్జెట్ ద్వారా రికవరీ అయినట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రీస్తు కొరటాల శివ ఫ్యాన్ ఫాలోయింగ్ తోడు కావడంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా

తారక్ గత సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. అంతేకాదు అండర్ వాటర్ సీక్వెన్స్ లు కూడా ఈ సినిమాలో భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఇక దేవర సినిమాకి విడుదలకు ముందే భారీ లాభాలు రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినీయం చేయడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కూడా ఈ సినిమా నిరాశపరచదు అని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అంతేకాదు అభిమానులు కోరుకుంటున్న ఇండస్ట్రీ హిట్ దేవర సినిమాతో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఇస్తారు అని నమ్ముతున్నారు. అలా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయం వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: