మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమమ్ సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీకి ప్రత్యేకంగా హీరో లాంటి ఫ్యాన్ బేస్ కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్స్ కి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోతూ ఉంటారు. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశంలోనే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ గా సాయి పల్లవి టాప్ లో ఉంది.ఎందుకంటే సాయి పల్లవి డాన్స్ లో ఒక గ్రెస్ ఉంటుంది. అది ఎవరినైనా ఈజీగా ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇక తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం విరాటపర్వం, తమిళంలో గత ఏడాది గార్గి మూవీతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ రెండు సినిమాలలో ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో చాలా ఆకట్టుకొంది.


అయితే ఆ సినిమాలు కమర్శియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది.గార్గి సినిమా తర్వాత చాలా మూవీ ఆఫర్స్ వచ్చి తనకి నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా రిజక్ట్ చేసింది. ఫైనల్ గా శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కుతోన్న సినిమాకి ఆమె ఒకే చెప్పింది. ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాలీవుడ్ లోకి కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వడానికి సాయి పల్లవి రెడీ అన్నట్లు తెలుస్తోంది.అమీర్ ఖాన్ తనయుడు డెబ్యూ మూవీలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే స్టోరీ నేరేషన్ జరగడం, సాయి పల్లవికి కూడా నచ్చి ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. అలాగే తెలుగులో నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో సాయి పల్లవి మళ్ళీ ఫాంలోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: