టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. కోలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటించే నయనతార ఇటీవలే బాలీవుడ్లోకి చాలా సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. అయితే ఇందులో ప్రియమణి కూడా నటించింది. అలాగే కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే కూడా నటించింది. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు.


సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది జవాన్ చిత్రం. ఇప్పటివరకు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నయనతారకు ఒక పీడకలలా మిగిలిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ అట్లీ ఈ కథ చెప్పినప్పుడు బాలీవుడ్ లో తన ఎంట్రీకి మంచి అవకాశం దొరికిందని చాలా సంబరపడిపోయిందట నయనతార. సినిమా చేస్తున్నప్పుడు కూడా తనకు ఎంతో ప్రాధాన్యం ఉందని భావించిందట.

అయితే తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే తను మెయిన్ హీరోయిన్ అయినా కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ దీపిక పదుకొనేకె ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ దీపిక సినిమాగా మారిపోయిందని తనను పక్కన పెట్టేసారని అది తనకు చాలా అవమానంగా ఉండడంతో విమర్శించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకమీదట బాలీవుడ్ సినిమాలకు నటించిన అని ఒక సంచలన నిర్ణయం నయనతార తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నటించవలసి వస్తే పలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సినిమాకి ఓకే చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి..ఈ విషయంపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: