ప్రముఖ
తమిళ నటుడు
సంగీత దర్శకుడు
విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు
మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతీ తెలిసిందే మీరా మరణంతో
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
డిప్రెషన్ స్ట్రెస్ తట్టుకోలేక 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. మీరా మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. ఎంతో అల్లారుముద్దుగా, అపురూపంగా పెంచుకున్న కూతురు కళ్ళముందు విగత జీవిగా పడుండడంతో తల్లిదండ్రులైన విజయ్, ఫాతిమా గుండెలు పగిలేలా రోదించారు. వాళ్ల పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు కూతురు మృతి చెందిన దగ్గర నుంచి ఇప్పటివరకు విజయ్ మీడియాతో మాట్లాడింది లేదు. కూతురి మరణాన్ని విజయ్ అంటోని తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే కూతురి మరణానంతరం దాదాపు మూడు రోజుల తర్వాత మొదటిసారి మీరా మరణం పై స్పందించాడు విజయ్ ఆంటోని. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన బాధను తెలియజేశాడు." ప్రియమైన స్నేహితులారా, నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళింది. ఆమె నాతో మాట్లాడుతోంది. నేను ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పటినుంచి ఏది చేసినా ఆమె కోసమే చేస్తాను. ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను" అంటూ పేర్కొన్నారు విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుంటే, మీకు ధైర్యం, సహనం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.