
గత కొన్ని చిత్రాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సాయికుమార్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరామిరెడ్డి, కోన వెంకటేష్ ,సాయికుమార్ మేకర్ స్క్రిప్టును సైతం అందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయడం జరిగింది..డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి నిర్మాత వేణుగోపాల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ముక్కు అవినాష్ బిగ్ బాస్ షో లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేదు.
ఈ సందర్భంగా ముక్కు అవినాష్ మాట్లాడుతూ జబర్దస్త్ బిగ్ బాస్ షోలలో తమను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు నభిషేక్ గారు తనను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటానని కూడా తెలిపారు. ఫ్రీ వెడ్డింగ్ ప్రసాద్ అనే టైటిల్ చెప్పగానే చాలామంది నవ్వుకున్నారు.. ఈ సినిమా చూసి కూడా నవ్వుకుంటారని అలాగే భయపడుతూ త్రిల్ అవుతూ ఉంటారని తెలియజేశారు ముక్కు అవినాష్. ఈ సినిమా అందరిని అలరిస్తుందని నమ్మకం ఉందని తమకు ప్రేక్షకుల సపోర్టు కావాలని తెలియజేశారు ముక్కు అవినాష్. మరి హీరోగా ముక్కు అవినాష్ సక్సెస్ అవుతారేమో చూడారి మరి.