
ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్.. ఇక ఇప్పుడు ఎంతో మంది హీరోలకు బ్యాక్ గ్రౌండ్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని మకుటం లేని మహారాజుగా ఏలాడు అనడంలో సందేహం లేదు. అయితే ఇక ఇలా తన కెరియర్ ఎదుగుదలలో ఎన్నో ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాడు చిరంజీవి. అయితే ఒకానొక సమయంలో ఏకంగా మెగాస్టార్ ను చంపడానికి ఒక హీరో ప్రయత్నించాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ అంచలంచెలుగా ఎదుగుతుంటే ఒక స్టార్ హీరో ఆయనను చూసి కుళ్ళు పడ్డాడట.
నన్ను మించిన హీరో అయిపోతున్నాడని ఓ హీరో మెగాస్టార్ పై కోపం పెంచుకున్నాడట. ఎలాగైనా చంపేయాలి అని కూడా అనుకున్నాడట. ఈ క్రమంలోనే తన కూతురు పుట్టిన రోజు ఉంది అని ఇంటికి ఆహ్వానించాడట. అన్నంలో విషం పెట్టి చంపడానికి ప్లాన్ చేశాడట. కానీ ఆ ఫంక్షన్ కు వెళ్ళిన సమయంలో మెగాస్టార్కు హెల్త్ బాగా లేకపోవడంతో.. ఇక అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండానే పాపకు బహుమతి ఇచ్చి ఓ ఫోటో దిగి అక్కడ నుంచి వచ్చేసాడట. తద్వారా ఇక మెగాస్టార్ ప్రాణాలతో బయటపడిపోయాడట. తర్వాత చిరంజీవికి ఈ విషయం తెలిసి ఎందుగానో బాధ పడిపోయాడట.