సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు అంటే తామరాకుపై నీటి బొట్టు లాంటిదని చెప్పాలి. ఎప్పుడు ఇండస్ట్రీలో వారి జీవితం నిలబడుతుంది ఎప్పుడు జీవితంలో కిందకు పడతామో తెలియని పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి స్టార్ డం రేపు ఉండకపోవచ్చు ఇప్పుడు లేనటువంటి స్టార్డం రేపు మనకు రావచ్చు.సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి రంగు పూసుకుంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి అందుకే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందని ఎంతోమంది సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అష్ట కష్టాలను పడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి పూజా హెగ్డే కు ప్రస్తుతం ఇండస్ట్రీలో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. ఒకానొక సమయంలో ఈమెను దర్శక నిర్మాతలు ప్రేక్షకులందరూ కలిసి స్టార్ హీరోయిన్గా చేసేసారు. ఇలా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజ హెగ్డే కు తల పొగరు కూడా కాస్త పెరిగింది.

 ఇలా ఈమె ఒక స్టార్ హీరోయిన్ అన్న భావనలో దర్శక నిర్మాతలను కేర్ చేయడం లేదు. ఇక స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వచ్చిన తనకు కాల్ షీట్స్ లేవంటూ వారిని ఇబ్బందులకు గురి చేశారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా నిర్మాతలను భారీగా డిమాండ్ చేసేవారు. ఇలా ఎంతో పొగరు చూపిస్తున్నటువంటి పూజా హెగ్డే కు శ్రీలీల రష్మిక రూపంలో భారీ దెబ్బ పడిందని చెప్పాలి.   ఈమె స్టార్ హీరోయిన్ అన్న భావనలో ఉంటూ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకే సరిగా డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాధే శ్యామ్ సినిమా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం కల్పించిన తనకు డేట్స్ ఖాళీగా లేవు అంటూ అవకాశాన్ని అలసత్వం చేయడంతో శ్రీ లీల ఈ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. ఇక రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా మొదట ఈమెకే అవకాశం వచ్చింది అయితే ఈమె తల పొగరు కారణంగా ఆ అవకాశం కాస్త రష్మికకు వెళ్ళిపోయింది. నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు అవకాశాలు వస్తున్నవి కూడా జారిపోవడంతో పలువురు పూజా హెగ్డే కెరియర్ పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కేవలం పూజ హెగ్డే హెడ్ వెయిట్ కారణంగానే తనకు సినిమా అవకాశాలు లేకుండా పోతున్నాయని ఇలాంటి పరిణామాలను చూస్తుంటే పూజా హెగ్డే కెరియర్ త్వరలోనే ముగుస్తుంది అనడానికి ఇది చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: