హీరో గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో మొదటిసారి ఈ సినిమా రాబోతోంది. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది.. పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చేశారు. హీరో గోపీచంద్ కూడా ఈ విషయాన్ని పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటేరాలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది.


ఈ గ్లింప్స్ లో అమేజింగ్ లొకేషన్స్ సైతం షేర్ చేశారు. ఇవన్నీ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ రేపటి నుంచి కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్లో రూపొందిస్తూ ఉన్నారు చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమా ప్రొడక్షన్ హైటెక్నికల్ సౌండ్స్తో నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం ఈ సినిమా షూటింగ్ వివిధ దేశాలలో అద్భుతమైన ప్రదేశాలలో సరిత చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది .కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది.



ప్రముఖ రచయిత గోపి మోహన్సినిమా స్క్రీన్ ప్లే అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీనువైట్ల తెరకెక్కించిన ఎన్నో చిత్రాలకు సైతం ఈయన పని చేసినట్లుగా తెలుస్తోంది. ఇక గోపీచంద్ నటించిన లక్ష్యం లౌక్యం చిత్రాలకు కూడా ఈయన స్క్రీన్ ప్లే గా పనిచేశారు. RX -100,SR. కళ్యాణ మండపం తదితర సినిమాలకు సైతం సంగీత దర్శకులుగా పనిచేసిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి వాట్స్అప్ లాకులతో సతమతమవుతున్న గోపీచంద్ శ్రీనువైట్లకు ఈసారి ఎలాంటి కథతో సక్సెస్ అందుకోబోతున్నారు అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులోని నటీనటుల వ్యవహారాల గురించి ఇంకా తెలియజేయలేదు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: