విభిన్నమైన చిత్రాలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగానే ఉంటారు హిరో చియాన్ విక్రమ్. ప్రస్తుతం విక్రమ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా ఒక విభిన్నమైన కథాంశం తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే విక్రమ్ మరే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని విషయం పైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందరికీ ఒక గుడ్ న్యూస్ ని అందించారు. డైరెక్టర్ ఆర్.ఎస్ విమల్ మెగా ఎపిక్ అయినా మహావీర్ కర్ణ చిత్రీకరణ త్వరలోనే పునర్ ప్రారంభం చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ని ప్రకటించడం జరిగింది.విక్రమ్ టైటిల్ రోల్ లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి కొన్ని యుద్ద సన్నివేశాలను కూడా చిత్రీకరించడం జరిగింది. కానీ అప్పట్లో కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోవడం జరిగిందట. ఈ సినిమా నుంచి విక్రమే స్వయంగా తప్పుకున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా డైరెక్టర్ విమల్ ఫేస్బుక్లో సూర్యపుత్రన్ కర్ణ రోలింగ్ త్వరలో అనే సందేహాన్ని విక్రమ్ స్టిల్ తో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నటీనటుల సిబ్బందికి సంబంధించిన విషయాలను కూడా అందించబోతున్నట్లు తెలిపారు.

తాజాగా కర్ణ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోని చూస్తూ ఉంటే బాహుబలి-2 లో క్లైమాక్స్ లాగా కనిపిస్తోంది భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కర్ణ సినిమాలో చూపించబోతున్నట్లు కనిపిస్తోంది.యాక్షన్ సన్నీ వేషాలు సరిత మించి కథ కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. మహాభారతంలోని కర్ణుడి పాత్రలో విక్రమ్ నటించిన పోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కచ్చితంగా బాహుబలి రికార్డులను సైతం తిరిగి రాసేలా కనిపిస్తోంది కర్ణ మూవీ. అందుకు సంబంధించి గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: