ఈటీవీలో ప్రతి శనివారం బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో వినదాన్ని పంచుతున్న సుమ అడ్డ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ తనదైన హోస్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. అలా సుమ అడ్డా షో కి కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రతివారం ప్రత్యేక సెలబ్రిటీ టీం తో సుమా చేసే సందడి అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలపై సుమా వేసే పంచులు, సెటైర్లు మధ్య మధ్యలో ఫన్నీ టాస్కులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం సుమ అడ్డా ఎపిసోడ్లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ టీం సందడి చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవగా

 ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రోమో వైరల్ అవుతుంది. ఒకప్పుడు టీవీలో యాంకర్ గా రాణిస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి చాలా ఏళ్ల తర్వాత సుమ అడ్డా షోలో సందడి చేసింది. కసారి ప్రోమోని గమనిస్తే.. 'నా షో కి రావడానికి ఎంత టైం పట్టింది నీకు?' అని సుమ స్వాతిని అడగగా, అందుకు స్వాతి బదిలిస్తూ.." మీరే నన్ను అసలు పిలవలేదు. నన్నంతా ఫుల్ ఇగ్నోర్ చేశారు. లవ్ ఇవ్వలేదు నాకు" అంటూ ఎంతో క్యూట్ గా చెప్తుంది. దాంతో సుమ స్వాతిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత 'నవీన్ గారు ఎలా ఉన్నారు? అని అడిగితే.." తను ఎప్పుడూ జెంటిల్మెన్ అని" స్వాతి చెపుతుంది. 

ఆ తర్వాత షోలో పాల్గొన్న రవికాంత్ కుర్చీలో కూర్చుని ఉండగా "ఈ అబ్బాయి పేరు ఏంటో కనుక్కో? అని సుమ చెబుతుంది. దానికి స్వాతి, 'పేరుతో ఇప్పుడు సంబంధం లేదు పిన్ని. నేను ఆల్రెడీ పడిపోయాను. అంతా అయిపోయింది' అని సిగ్గుపడుతూ చెప్తుంది. ఇక ప్రోమో చివర్లో.." ఈటీవీలో అఫీషియల్ గా చెప్పేస్తున్న ఏంటంటే, నాకు రవికాంత్ మీద పెద్ద క్రష్ ఉంది. నాకు రవికాంత్ కావాలి" అని స్వాతి చెప్తుండగా సుమాతో పాటు షోలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 30న ఈటీవీలో ప్రసారం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: