బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ జవాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పేను సంచలనాలను సృష్టిస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్గా నయనతార నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.



మొదటి వారం ముగిసే సమయానికి 400 కోట్ల రూపాయల క్రాస్ అందుకున్న ఈ సినిమా 10 రోజులలో 800 కోట్లను కలెక్షన్ చేసింది ఇక మూడు వారాలు పూర్తి అయ్యేసరికి 1000 కోట్ల మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ అట్లీనే తెలియజేశారు ఈ సినిమా రూ.1004.92 కోట్ల కలెక్షన్ ని అందుకుంది అంటూ తెలియజేయడం జరిగింది ఈ మార్కు అందుకోవడంతో షారుఖ్ ఖాన్ సరికొత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు ప్రభాస్, యష్, రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రమే ఈ వెయ్యి కోట్లు మార్పుని అందుకున్నారు అయితే వీరందరికీ వెయ్యి కోట్ల క్లబ్లో ఒక్క సినిమా మాత్రమే ఉన్నది. అయితే షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో ఆ మార్కుని రెండవసారి అందుకోవడం జరిగింది. 1000 కోట్ల లలో రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా రికార్డు పొందాడు.దీంతో షారుక్ ఖాన్ అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఈ ఏడాది నుంచి మరొక మూవీ కూడా రాబోతోంది అదే డంకి. ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యిందంటే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నట్లే అని చెప్పవచ్చు. మరి ఎలాంటి రికార్డులను షారుఖ్ ఖాన్ సృష్టిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: