లెజెండరీ క్రికెటర్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా 800 అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎంఎం శ్రీపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ను ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. ముత్తయ్య మురళీధరన్ గా 'స్లమ్ డాగ్ మిలీనియర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే మది మల్లర్ పాత్రలో మహిమ నంబియార్ కనిపించనున్నారు. అక్టోబర్ 6 న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్ర కోసం మొదట తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధర్ ని పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో 

ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు రాజకీయ విశ్లేషకులు కూడా విజయ్ సేతుపతి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలు కారణాలవల్ల విజయ్ సేతుపతి ఈ బయోపిక్ నుంచి తప్పుకోగా, అతని స్థానంలో 'స్లమ్ డాగ్ మిలీనియర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించాడు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముత్తయ్య మురళీధరన్ విజయ్ సేతుపతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 800 మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పడానికి గల కారణాలను వెల్లడించారు." 800 మూవీని చేయాలని మేము ఎప్పుడో అనుకున్నాం. ఐపీఎల్ ఆడుతున్న రోజుల్లోనే ఓసారి మేము ఉన్న హోటల్లో విజయసేతుపతి కూడా ఉన్నారు. 

 దాదాపు ఐదు రోజుల తర్వాత ఆయన మాకు రెండు గంటల పాటు సమయం కేటాయించారు. ఆ సమయంలో నా ఆట తీరంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనతో మేము 800 కథ గురించి చర్చించాం. కథ విన్నాక ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కథలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోనని, తప్పకుండా ఈ సినిమాలో భాగమవుతానని చెప్పారు. మా మధ్యన డీల్ కూడా కుదిరింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం, విజయ్ సేతుపతి కుటుంబ సభ్యులు సైతం బెదిరింపులు ఎదుర్కోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ట్రూ స్టోరీ" అని మురళీధరన్ అని తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: