టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాకి గాను ప్రస్తుతం 30 నుండి 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఈ మధ్య రెమ్యనరేషన్తో పాటు లాభాల్లో సైతం వాటా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కోట్లలో పారితోషకం తీసుకుంటున్న
చిరంజీవి రెమ్యూనరేషన్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేదట.
ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్ ఒకప్పుడు ఉండేవి కావని, వాటాలు కూడా లేవని వేలల్లో మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చే వారిని ఈ సందర్భంగా పేర్కొన్నారు వీరేంద్రనాథ్." నేను రచయితగా పనిచేస్తున్నప్పుడు ఒక సమయంలో ఒకే డైరెక్టర్ తో మాత్రమే పని చేశాను. అలా కోదండరామిరెడ్డి గారితో ఒకే సమయంలో 8 కి పైగా సినిమాలు చేశాను. అప్పట్లో రెమ్యునరేషన్స్ మాత్రమే ఇచ్చేవారు. సినిమాకి వాటాలు తీసుకునే అవకాశం లేదు. నాకు అభిలాష సినిమాకు 20,000 ఇస్తే 'స్టువర్టుపురం పోలీస్ స్టేషన్' సినిమాకు డైలాగ్, స్క్రిప్ట్, స్టోరీ, డైరెక్షన్ కలిపి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో రెమ్యూనరేషన్స్ పెద్ద మొత్తంలో ఉండేవి కాదు. కమల్ హాసన్, శ్రీదేవి లాంటి యాక్టర్స్ కి అప్పట్లో రెండు లక్షలు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అలాగే నా సినీ కెరియర్లో నేను ఎంతో మంది డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో జర్నీ చేశాను. నా జర్నీలో సినిమాల్లో పార్ట్నర్ షిప్స్, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు" అని అన్నారు. ఎన్నో వ్యక్తిత్వ వికాసాలను బోధించిన మీరు జీవితంలో నేర్చుకున్న నీతి ఏంటని? రిపోర్టర్ అడిగితే దానికి బదులిస్తూ.." ఒకటి నవ్వుతూ ఉండాలి. నా వాళ్ళు బాగుండాలి, నేనే బాగుండాలి అనే తాపత్రయం ఉండకూడదు. రెండోది మనం కంఫర్టబుల్గా బతకడానికి వీలైనంత డబ్బు ఉండాలి. నేను వ్యక్తిత్వ వికాస పాటలు బోధించడం వల్ల కోపం పూర్తిగా తగ్గిపోయింది. నేను కోప్పడి దాదాపు 15 ఏళ్ల అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు యండమూరి వీరేంద్రనాథ్...