తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం లియో. భారీ బడ్జెట్ తో  సిద్ధమైన ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.లోకేష్ కనగరాజ్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి కచ్చితంగా రీచ్ అవుతాడని ఆడియన్స్ కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. తళపతి విజయ్, త్రిష ఏకంగా 14 ఏళ్ళ తర్వాత మరల ఈ మూవీలో జోడీగా కనిపిస్తున్నారు.సంజయ్ దత్, అర్జున్ సర్జా లాంటి లెజెండరి స్టార్ యాక్టర్స్ మూవీలో ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు బాగా పెంచింది. సినిమాపై ఇప్పటికే బిజినెస్ కూడా అయిపొయింది. నిర్మాతకి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో యాక్షన్స్ సన్నివేశాలకి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఒక రేంజ్ లో తీశారట. కార్ చేజింగ్ సీన్ కోసం కోట్ల రూపాయిల ఖర్చు పెట్టి తీశారట. అలాగే సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ దాకా లోకేష్ స్టైల్ లో అద్భుతమైన సీన్స్ ఉంటాయట. ఖచ్చితంగా గూస్ బంప్స్ రావడం ఖాయమట.ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందట.


ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడని విధంగా కాశ్మీర్ లో మంచు కొండల్లో హైనాలతో హీరో చేసే ఫైట్ సీక్వెన్స్ ని లోకేష్ అద్భుతంగా డిజైన్ చేశాడట. కథలో భాగంగా వచ్చే ఈ సీక్వెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో ఎక్కువ ఖర్చు కూడా చేయడం వల్ల చాలా రిచ్ గా ఉంటుందట. హైనాలతో పోరాట ఘట్టాన్ని ఆరంభంలోనే షూట్ చేసి విఎఫ్ఎక్స్ టీంకి లోకేష్ ఇచ్చేశారు. ఈ సీన్ తర్వాత మిగిలిన షూటింగ్ అంతా కూడా చేసుకున్నారు. అందుకే ఎక్కువ టైం దొరకడంతో చాలా అద్భుతంగా హైనాతో ఫైట్ సీక్వెన్స్ ని విఎఫ్ఎక్స్ నిపుణులు ఆవిష్కరించారు.10 నిమిషాలు ఉండే ఈ సన్నివేశం కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు పెట్టారట. ఓ విధంగా చెప్పాలంటే మినిమం రేంజ్ లో టైర్ 3 హీరో సినిమా కోసం పెట్టిన పెట్టుబడి కేవలం 10 నిమిషాల ఎపిసోడ్ కోసం లియో సినిమాలో వాడేశారు. దీనిని బట్టి లోకేష్ ఎలాంటి విజన్ తో ఆ సీక్వెన్స్ ని రెడీ చేసి ఉంటాడో అంచనా వేయవచ్చు. ఈ సినిమాని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూసేలా అంత బాగా తీశాడట లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Leo