గత కొద్దిరోజులుగా లియో సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం బిజీగా ఉన్నది.. మొదట 10 నిమిషాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని తెలియజేస్తున్నారు. అయితే తమిళనాడులో ఈ సినిమాకు మార్నింగ్ షోలు లేవన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లియో సినిమాకు బెనిఫిట్ షో లు లేవని సమాచారం. అయినప్పటికీ కూడా లియో సినిమా పూర్తిస్థాయి బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి.. విడుదలైన మొదటి రోజు బుక్ మై షో లో ఒక గంట వ్యవధిలోని 74 నేల టికెట్లు సైతం అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది..
షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బుక్ మై షో లో ఒక గంటలోనే 90 వేల టికెట్లు సైతం అమ్ముడుపోయాయి. ఇప్పుడు లియో సినిమా సైతం ఆ రికార్డులను ఛేదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లీయో సినిమా విజయ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. లోకేష్ కనకరాజు కూడా తన స్నేహితులకు ఈ సినిమాను చూపించారట ఇందులో 10 మంది చూడగా ఇందులో 8 మందికి ఈ సినిమా నచ్చిందని తెలిపారట. మరి తన స్నేహితులకే మెప్పించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి