టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతో ఓపికగా ఒద్దిక
గా అచ్చం సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవతారకం లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. బాలకృష్ణ భార్యగా ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన సినిమాలలో రాజకీయ విషయాలలో ఆమె ఎందులో కూడా తలదూర్చరు.  కేవలం ఇంటిపట్టునే ఉంటూ అటు కుటుంబాన్ని ఇటు పిల్లలని చూసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఇకపోతే అలాంటి వసుంధర దేవి తాజాగా తన కొడుకు, కోడలు విషయంలో ఒక క్రేజీ కండిషన్ ని బాలయ్యకు పెట్టిందట. అదేమిటంటే ఆ అమ్మాయే తన ఇంటికి కోడలుగా రావాలని కోరినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తన కొడుకు మోక్షజ్ఞ తనని గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మాట్లాడాడని.. తాను శ్రీ లీలాను  హీరోయిన్ గా పెట్టుకుంటాను అంటే.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. ఆమెను మీరు హీరోయిన్ గా తీసుకుంటారా ? అని మోక్షజ్ఞ చెప్పినట్లు బాలయ్య ఈ విషయాన్ని బయటపెట్టి ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే.



అంతే కాదు ఈ వార్తలు వైరల్ అవ్వడంతో మోక్షజ్ఞ, శ్రీ లీల పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త కూడా నెట్టింట వైరల్ అయింది. ఈ క్రమంలోనే వసుంధర దేవి కూడా మన ఇంటికి కోడలుగా, నందమూరి మోక్షజ్ఞ కి భార్యగా శ్రీ లీలా అయితే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు వసుంధర దేవి బాలకృష్ణతో చెప్పిందట. మొదటిసారి తన భార్య నోరు విప్పి అలా అడిగేసరికి బాలకృష్ణ ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఒక నవ్వు నవ్వారట. ఇకపోతే ఈ విషయం లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: