ఈ విషయం తెలిసినప్పటి నుండి ఈ సినిమాకు, 'చెన్నకేశవరెడ్డి'కి అభిమానులు పోలికలు మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో కూడా ఇలానే రిలీజ్ టైమ్‌లో ఓ పాట పెట్టకుండా.. రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత పెట్టారు. శ్రియ – బాలకృష్ణ మధ్య తీసిన 'నలుపు నలుపు తెలుపు తెలుపు' పాటను యాడ్ చేశారు. అయితే అప్పటికే ఆ సినిమా (ఫలితం) తేలిపోవడంతో జనాలు మళ్లీ ఆ పాటను చూడటానికి థియేటర్లకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలానే ఆలస్యంగా పాటను యాడ్ చేస్తున్నారు.దీంతోపాటు మరో పాయింట్ కూడా కామన్‌గా ఉంది. అదే జైలు సన్నివేశాలు. 'చెన్నకేశవరెడ్డి' సినిమా జైలు నేపథ్య సన్నివేశాలతోనే ప్రారంభమవుతుంది. కాసేపటి కథ వేరే దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 'భగవంత్ కేసరి'లో కూడా అలానే జైలు సన్నివేశాలు తొలి పదిహేను నిమిషాలు ఉన్నాయి అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి