తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కు ఉన్న ఫాలోయింగ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటె అనిల్ డైరెక్షన్ వహించిన ప్రతి మూవీ కూడా హిట్ అనే చెప్పాలి. ఇకపోతే దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా అందరికి పరిచయమేమెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలను చేస్తున్నాడు.. చేతిలో కనీసం మూడు నాలుగు ప్రాజెక్టులు ఉండేలా చూసుకుంటున్నాడు.మెగాస్టార్ ఈ మధ్యనే రెండు సినిమాలను ప్రకటించాడు. మెగా 156, 157 సినిమాలు ప్రకటించాడు..చిరు 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.. ఇక చిరు 157వ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు. బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు..ఇవి అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

ఈ రెండు లైనప్ లో ఉండగానే మరో సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.. మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం అనిల్ చేసిన భగవంత్ కేసరి సినిమా మొన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకు పోతుంది.  దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అనిల్, దిల్ రాజు కాంబోలో ఒక భారీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని అందులో మెగాస్టార్ హీరోగా నటిస్తున్నాడని టాక్ వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పై ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయని దీనిపై క్లారిటీ కూడా త్వరలోనే వస్తుందని టాక్.. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: