స్కంద సినిమాలో రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను తన స్టైల్‍లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, కథనం, ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో థియేటర్లలో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది . భారీ అంచనాలతో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులని నిరాశపరిచింది.స్కంద సినిమాలో రామ్ పోతినేని సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. రామ్, శ్రీలీల డ్యాన్సులు ఈ చిత్రంలో అదిరిపోయాయయి. అలాగే సినిమాలో సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా మరియు ప్రిన్స్ సెసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా స్కంద సినిమాను గ్రాండ్ గా నిర్మించాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి