నేటితరం లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి అన్నదాన్ని ఈ సినిమా ద్వారా సాయి రాజేష్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇలా ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ 10 కోట్లతో నిర్మితమై దాదాపు 90 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది అని చెప్పాలి. ఇక హీరో ఆనంద్ దేవరకొండ కి కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ చిన్న మూవీపై ప్రస్తుతం ఇతర భాషల డైరెక్టర్ల దృష్టి కూడా పడింది అన్నది తెలుస్తుంది. అయితే ఈ మూవీని మిగతా భాషలో రీమేక్ చేయడానికి డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారట.
ఈ క్రమంలోనే బేబీ మూవీ ని హిందీలో రీమేక్ చేయడానికి అటు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. అయితే తెలుగులో వైష్ణవి చైతన్యకు బేబీ సినిమా ద్వారా లైఫ్ ఇచ్చిన సాయి రాజేష్ ఇక హిందీలో ఎంతో ఫేమస్ అయిన ముగ్గురు యూట్యూబర్లైన అమ్మాయిల పేర్లను పరిశీలిస్తున్నాడట. వీరిలో ఒకరిని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. హిందీ మూవీకి కూడా సాయి రాజేశ్ దర్శకత్వం వహించబోతున్నాడట. అంతేకాదు మరో స్టార్ హీరో కొడుకుని కూడా ఈ మూవీ ద్వారా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి