ఈ క్రమంలోనే నితిన్ ఫ్యామిలీ కూడా వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. నితిన్ తన భార్యతో పాటు తన అక్క బావలతో కలిసి ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమందిని వారు పర్సనల్ గా కూడా ఇన్వైట్ చేశారంట అలాంటి వారిలో ఒక హీరోయిన్ కూడా ఉందని అయితే ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లి మరి వరుణ్ తేజ్ పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేసిన ఆమె మాత్రం పెళ్లికి రాకుండా ఉన్నారట. ఇలా పెళ్లికి రాకుండా ఉండడంతో వీరి వ్యవహారం గురించి పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే నటి రాశి ఖన్నా తో కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు అయితే వరుణ్ తేజ్ రాశిఖన్నాను స్నేహితురాలిగా చూసినప్పటికీ ఆమె మాత్రం వరుణ్ ను ప్రేమించిందని తెలుస్తోంది. అయితే ఈమెది వన్ సైడ్ లవ్ కావటం విశేషం. ఈమె వరుణ్ చాలా గాఢంగా ప్రేమించిందని, లావణ్య స్థానంలో తాను ఉండాలని కోరుకుందని తెలుస్తుంది. అయితే ఈమె తనని ప్రేమిస్తుందని తెలిసినప్పటికీ వరుణ్ మాత్రం తనని ఫ్రెండ్ గానే యాక్సెప్ట్ చేశారట. ఈ క్రమంలోని ఇంటికి వెళ్లి మరి తన పెళ్లికి రావాలని చెప్పగా రాశి ఖన్నా మాత్రం తాను ప్రేమించిన వ్యక్తి మరొక అమ్మాయిని పెళ్లి తీసుకోవడం ఇష్టం లేక ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు అంటూ తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. శుభమా అంటూ పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట గురించి అప్పుడే ఇలాంటి వార్తలను సృష్టించడం ఏమాత్రం భావ్యం కాదని, అయినా లావణ్య త్రిపాఠితో ఈయన దాదాపు 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉంటున్నారని వీరిద్దరి స్వచ్ఛమైన ప్రేమ అంటూ కొందరు అభిమానులు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి