కానీ ఆ తర్వాత పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలో కనిపించి తన విలనిజంతో కూడా ప్రేక్షకులను మెప్పించ గలిగాడు. దీంతో ఇక సునీల్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. వైవిద్యమైన పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో అవకాశాలకు కొదవలేకపోయినప్పటికీ.. ఎందుకో సునీల్ మాత్రం అటు కోలీవుడ్ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఆశలు పెంచుకున్నాడు. దీంతో ఎక్కువగా తమిళ సినిమాల లోనే నటిస్తూ ఉన్నాడు. అయితే ఇలా ఇతర భాషల సినిమాల్లో నటించి మార్కెట్ ను పెంచుకోవాలి అనుకోవడంలో తప్పేం లేదు.
కానీ సునీల్ నటించిన మూవీ ప్రమోషన్స్ లో మాత్రం తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను అన్నట్లుగా తనను తాను తక్కువగా చేసుకుంటున్నాడు. తెలుగులో అప్పుడెప్పుడో కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టి.. తర్వాత హీరోగా స్టార్డం సంపాదించుకొని.. ఇక ఇప్పుడు విలన్ గా రాణిస్తూ ఉన్నాడు. తమిళ్లో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అతనికంటూ తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇక్కడ ఆఫర్లను పక్కనపెట్టి మరి ఇక తమిళ్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న యాక్టర్ లాగా మాట్లాడటం చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్‌ను బట్టి తనను తాను మరీ తక్కువ చేసి మాట్లాడుకునేంత చిన్న యాక్టర్ సునీల్ కాదని అభిమానులు కూడా భావిస్తున్నారు. హైదరాబాద్ ఇల్లు అయితే చెన్నై ఏకంగా టెంపుల్ అంటూ ఇటీవలే మాట్లాడాడు. ఇక ఇలాంటి మాటలు విని సునీల్ ఇంతలా ఎందుకు తగ్గుతున్నారు అని అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.