యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా సలార్‌. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ హీరో అయిన ప్రభాస్‌, కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ దర్శకుడిగా మారిన ప్రశాంత్‌ నీల్‌ కాంబో లో మూవీ అంటూ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి.అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేసి తీరుతాం అంటూ మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 21 న USA ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఇక విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగా కూడా ఒక పాట షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో షూటింగ్ జరుపుతున్న ఈ స్పెషల్ పాటలో హాట్‌ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ కనిపించబోతుంది.


బంగార్రాజు, డర్టీ హరి సినిమాతో పాటు బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో కనిపించి మెప్పించి తన హాట్ అందాలతో ఉర్రూతలూగించిన సిమ్రత్‌ కౌర్‌ సలార్‌ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. ఇక ప్రభాస్ తన మోకాలి సర్జరీ పూర్తి చేసుకొని యూరప్ నుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి దాకా సిమ్రత్‌ కౌర్ సింగిల్‌ షాట్స్ ను షూట్ చేసిన మేకర్స్ త్వరలో ప్రభాస్‌ కూడా సెట్స్ లో జాయిన్‌ అవ్వబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. హాట్ బ్యూటీ శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం సలార్‌ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: