గేమ్ ఛేంజర్ సినిమా కథ, కథనం ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు. మరోవైపు దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన జరగండి సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. ఆడియో రైట్స్ డాక్యుమెంటేషన్ సమస్య వల్ల ఈ సాంగ్ రిలీజ్ కావడం లేదని దిల్ రాజు చెప్పారు. గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ నమ్మేలా లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ హిట్ గా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా 2024 సెకండాఫ్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి