తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా అనేక సంవత్సరాలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వెంకటేష్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో జయం మనదేరా మూవీ ఒకటి.

మూవీ లో సౌందర్య ... వెంకటేష్ జోడీగా నటించగా ... ఎన్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని సురేష్ బాబు నిర్మించగా ... వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ 2000 సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలకపాత్రను పోషించింది. ఈ సినిమాలో వెంకటేష్ తండ్రి మరియు కొడుకు పాత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీన వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: