ఇదిలా ఉంటే సినిమా రిజల్ట్ పై ఆయన రియాక్షన్ ఏంటి? మీతో ఏం చెప్పాడు? అనే ప్రశ్న పాయల్‌కి ఎదురైంది. దీనిపై స్పందించేందుకు ఇబ్బంది పడింది పాయల్. ఆయన తన చైల్డ్ వుడ్ నుంచి మంచి ఫ్రెండ్ అని చెప్పిన పాయల్.. సౌరభ్ గురించి ఏం చెప్పాలి? అంటూ ఆయన్ని చూస్తూ `నీ గురించి అడుగుతున్నారు ఏం చెప్పాలి? నేను ఏం మాట్లాడలేకపోతున్నా` అంటూ కాస్త ఇబ్బంది పడింది.ఆ తర్వాత స్పందిస్తూ, ఈ స్టోరీని తాము ఇద్దరం కలిసే విన్నామని చెప్పింది. అయితే ఆ సమయంలో తనకు ఈ పాత్ర చేయాలా? వద్దా అనే తేల్చుకోలేకపోయానని, ఆడియెన్స్ ఎలా తీసుకుంటారనే సందేహాలు కలిగాయి.మొదట ఈ పాత్ర నేను చేయాలా? వద్దా అనుకున్నాను. కానీ ఆ సమయంలో సౌరభ్ తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడని, అజయ్ భూపతిపై నమ్మకం ఉందని, ఆయన బాగా చేయగలరని నమ్ముతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇలా అలా అని సొంతంగా చేయడం వద్దు, అజయ్ చెప్పినట్టు చేయమని సలహా ఇచ్చాడు. తాను కూడా అలానే చేశానని, దాని ఫలితమే ఇది అని చెప్పింది పాయల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి