
వరల్డ్ వైస్ గా సలార్ మేనియా సైతం సరికొత్త కలెక్షన్లను సృష్టిస్తుంది అంటూ పలువులు అభిమానులు తెలియజేస్తున్నారు. డార్క్ సెంట్రిక్ టీమ్ తో ఇండియాలో మొదటిసారి రూపొందిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ లో కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉండబోతుందట. డిసెంబర్ 1వ తేదీన సలార్ సినిమా ట్రైలర్ సైతం విడుదల చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా చిత్ర బృందం తెలియజేస్తూనే ఉంది. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం మరో 10 రోజులలో సలార్ ట్రైలర్ బయటికి రాబోతోంది 10 డేస్ టు సలార్ ట్రైలర్ అంటూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ని విడుదల చేస్తూ డిసెంబర్ ఒకటి సాయంత్రం 7:19 నిమిషాలకు సలార్ సినిమా ట్రైలర్ ముందుకు రాబోతోందని రాసుకురావడం జరిగింది. ప్రభాస్ ఫేస్ రివిల్ చేయకుండానే కట్ చేసిన టీజర్ కేవలం 24 గంటలలోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టడం గమనార్హం. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మరి డిజిటల్ రికార్డులను సైతం ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి మరి.