బుల్లితెరపై టాప్ యాంకర్ల లిస్టులో యాంకర్ సుమ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. ఎంతో కాలంగా యాంకర్ గా కొనసాగుతున్న సుమా తన కొడుకును టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరో గా పరిచయం చేసింది. రోషన్ కనకాల హీరోగా చేస్తున్న మొదటి సినిమా బబుల్ గమ్.  క్షణం కృష్ణ అండ్ హిస్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్  తెరకెక్కించిన ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ హీరోయిన్గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతోంది .అయితే బబుల్గం సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోంది.

 కాగా ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని శరవేగంగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే కొన్ని పాటలను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి పాట ఇది వరకే విడుదల చేయగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. ఇప్పుడు రెండో పాటని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అయితే బబుల్ గమ్ సెకండ్ సింగల్ ఇజ్జత్ పాట కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారు యాంకర్ సమ కనకాల.

నవంబర్ 23న ఇజ్జత్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రోషన్ కనకలా స్టన్నింగ్ లుక్‌తో అట్రాక్ట్ చేయగా.. చిరంజీవి సాంగ్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసి కొడుకు రోషన్ సినిమా ప్రచారం కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపి యాంకర్ సుమ మాస్టర్ స్కెచ్ వేసిందిగా అని పలువురు భావిస్తున్నారు. చిరంజీవి ప్రచారంతో రోషన్ కనకాల సినిమా బబుల్ గమ్‌కు మంచి ప్రమోషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అలా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద ప్లానే వేసింది సుమ. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు వైవాహర్ష కిరణ్ మచ్చ అనన్య ఆకుల వంటి చాలామంది కొన్ని కీలక పాత్రలో కనిపించబోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: