రానా నాయుడు సిరీస్‌లో వెంకటేష్ తో పాటు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించాడు. తొలిసారి బాబాయ్, అబ్బాయ్ కాంబో వచ్చిన ఈ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ బోల్డ్ రోల్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. కథలో బోల్డ్ కంటెంట్ మినహా ఎలాంటి కొత్తదనం లేదంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. రానా నాయుడు సిరీస్‌కు సూపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటిస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న పాన్ ఇండియన్ లెవెల్‌లో సైంధవ్ రిలీజ్ కాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి