బిగ్ బాస్ సెవెన్.. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. దీంతో బుల్లితెరపై ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. ఇక టాప్ ఫైవ్ లో నిలవబోయే కంటెస్టెంట్స్  ఎవరు అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ వీజే సన్నీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రిపోర్టర్ గా యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన  సన్నీ  ఇక తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి తెగ పాపులారిటీ సంపాదించాడు. ఏకంగా పక్కింటి కుర్రాడే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడేమో అన్నట్లుగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అంతేకాదు ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అతను నటించిన సౌండ్ పార్టీ అనే సినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 7 సీజన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌండ్ పార్టీ రిలీజ్ కారణంగా నా పరిస్థితి నామినేషన్ ఎలిమినేషన్ మాదిరిగా మారింది. సినిమాలతో బిజీగా ఉండడంతో రెగ్యులర్గా ఆ షో ఫాలో కావడం లేదు.


 సౌండ్ పార్టీ సినిమాను బిగ్ బాస్ తెలుగు సెవెన్ వేదికపై ప్రమోట్ చేయాలని అనుకున్నాను. కానీ అప్పటికే పెద్ద సినిమాలు తమ ప్రమోషన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాయి. దీంతో నాకు నా సినిమాను బిగ్ బాస్ వేదికగా ప్రమోట్ చేసుకునే అవకాశం దొరకలేదు. ఈ సీజన్లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్న విషయంపై స్పష్టంగా క్లారిటీకి రాలేకపోతున్నాను. ఎందుకంటే ఒక్క వారం ఒకరు బాగా ఆడితే మరో వారం మరొకరు బాగా ఆడుతున్నారు. ఇక నాకు అనిపించిన దాని ప్రకారం.. శివన్న, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమరదీప్, ప్రియాంక జైజ్ లు టాప్ ఫైవ్ లో ఉంటారని అనుకుంటున్నాను. విజేత ఎవరు అని చెప్పడం మాత్రం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: