మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత చరణ్ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ చరణ్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఈ సినిమా యొక్క చిత్రీకరణ మాత్రం చాలా స్లోగా జరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఈ సినిమా షూటింగ్ తో పాటు శంకర్ "ఇండియన్ 2" మూవీ షూటింగ్ ను కూడా ఏకకాలంతో పూర్తి చేస్తూ వస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ రోజు నుండి ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ మైసూర్ లో స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చరణ్ ... శంకర్ కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: