ఈ బిగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాలి అనుకున్న మాట వాస్తవమే కానీ.. అది రవితేజతో తీస్తే అనుకున్నంత ప్రాఫిట్స్ రావు అని.. ధమాకా సినిమా తర్వాత రవితేజతో సినిమాలు తీసిన ఒక్క నిర్మాత కూడా లాభాల కళ్ళు చూడలేదని అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆపేయడం బెటర్ అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఇదే విషయం (Ravi Teja) రవితేజకు చెప్పగా రవితేజ కూడా సున్నితంగానే ఈ నిర్ణయానికి ఓకే చెప్పారట.అంతేకాదు మైత్రి సంస్థతో గోపీచంద్ మలినేని తీసుకున్న డేట్స్ ఇప్పుడు మరో హీరో కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారట . ఇది నిజంగా రవితేజ అభిమానులకి జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి . ఒక సినిమా హిట్ పడితే కానీ మళ్లీ రవితేజ హిట్ ట్రాక్ లోకి రాలేడు . డైరెక్టర్స్ కూడా ఆయనతో సినిమాలను తెర్స్కెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి