తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోయిన్లకు సైతం ఈమెను చూస్తే భయపడేలా చేస్తోంది. దాదాపుగా ఒక్క ఏడాదిలోని 12 సినిమాలను సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ అమ్మడు అందానికి క్యూట్నెస్ కి డ్యాన్స్ కి ఫిదా అయ్యారు కుర్రకారలు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటుంది శ్రీలీల. దీంతో ఇమే తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలను నటించేందుకు సిద్ధంగానే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


తెలుగు తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఆధర్వ మురళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాలో నటించడం జరిగింది.. ఆ తర్వాత తమిళ చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తను నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. అయితే ఈ విషయం పైన శ్రీ లీల క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


తాను త్వరలోనే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయంపై మాట్లాడుతూ.. శ్రీ లీల తాను తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచన అయితే ఇప్పట్లో లేదని.. తనకి ఒక నటుడు సినిమాలో అవకాశం వచ్చిందనే విషయం ఒట్టి రూమర్లే అంటూ తెలియజేయడం జరిగింది శ్రీలీల.. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురైనట్లు తెలిసిన మరి కొంతమంది అభిమానులు మాత్రం శ్రీ లీల తెలుగులోని స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.. ఈమెకు స్టార్ హీరోలతో కూడా అవకాశాలు వస్తున్నాయి.. ఇవి చేయడానికి సమయం చాలడం లేదు మరి ఇతర భాషలలో కూడా డేట్లను అడ్జస్ట్ చేయలేక వెళ్లలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: