'కాంతార' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కన్నడ యాక్టర్‌ రిషబ్‌శెట్టి. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్సాఫీస్‌ వద్ద 400 కోట్లకు పైగా కాసుల వర్షం కురిపించింది. కన్నడ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.కాగా ఇప్పుడు రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో కాంతార ప్రీక్వెల్గా  'కాంతార చాప్టర్ -1 వస్తుంది. కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా విడుదల అయ్యింది. కాంతారను మించిన విజువల్స్‌ బాక్సాఫీస్‌ వద్ద మోత మోగించడం ఖాయమని టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్‌ శెట్టి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో వివిధ ఇండస్ట్రీల నుంచి 15 మంది పాపులర్ యాక్టర్లు కనిపించబోతున్నారన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్‌ నుంచి మొత్తం 15 మంది యాక్టర్లను తీసుకోబోతున్నారట.


ఒకవేళ ఇదే కనుక నిజమైతే కాంతార చాఫ్టర్ 1 ఘనవిజయం సాధించడం ఖాయమైపోయినట్టేనంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ప్రస్తుతానికి ఇది గాసిప్‌ మాత్రమే అయినా ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ లవర్స్.కాంతార తొలి పార్టును రూ.16 కోట్లలోపే తెరకెక్కించిన రిషబ్ శెట్టి.. ప్రీక్వెల్‌ కోసం ఏకంగా రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. రిషబ్ శెట్టి టీం ఒక్క ప్రీ ప్రొడక్షన్‌ కోసమే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు జోరుగా టాక్ నడుస్తోంది. హొంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. అజనీష్‌ లోకనాథ్ ఈ మూవీకి మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. మొత్తానికి విడుదలకు ముందే కొత్త కొత్త అప్‌డేట్స్‌తో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఈ కాంతార చాఫ్టర్‌ 1. చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: