కోలీవుడ్లో సీనియర్ హీరోగా పేరుపొందిన DMK అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యం పైన గత కొద్ది రోజుల నుంచి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి... గత కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 వ తేదీన చెన్నైలో మయత్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే గొంతు నొప్పి, జలుబు తో కూడా హాస్పిటల్ లోకి జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానుల సైతం కాస్త ఆందోళనకు గురికావడం జరిగింది.


అయితే పలువురు నేతలతో పాటు కుటుంబ సభ్యులు సైతం విజయకాంత్ కు సాధారణ పరీక్షలు చేశామని ఆయనకు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని గతంలో తెలియజేయడం జరిగింది..DMK నేతలు మాత్రం గత పది రోజుల నుంచి ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని ఈరోజు ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు కూడా తెలియజేయడం జరిగింది.. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారు కానీ గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదంటూ పల్సరి చికిత్స కూడా అందిస్తున్నామంటూ విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామంటూ వైద్యులు సైతం తెలియజేయడం జరిగిందట.

అయితే గత కొన్ని గంటల నుంచి విజయకాంత్ మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ వార్తల పైన విజయకాంత్ భార్య ప్రేమలత కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. కెప్టెన్ విజయ్ బాగున్నారని ఆయన ఇంకా చనిపోలేదని ఇలాంటి రూమర్స్ అసలు నమ్మకండి వైద్యులు చికిత్స అందిస్తున్నారని పూర్తి ఆరోగ్యంగా త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తారని అప్పటివరకు ఇలాంటి వార్తలని అసలు నమ్మకండి అంటూ తెలియజేయడం జరిగింది. దీంతో విజయకాంత్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానుల సైతం దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: