డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న యాక్షన్ త్రిల్లర్ సినిమా యానిమల్ ఈ సినిమాలో హీరోగా రణబీర్ కపూర్ నటించిన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషలలో ఈ చిత్రాన్ని రేపటి రోజున ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. మునుపెన్నడు చూడని విధంగా రణబీర్ ని ఈ సినిమాలో చాలా వైలెంట్ గా చూపించబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతుంది.


అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ లో కూడా యానిమల్ సినిమా దుమ్ము లేపుతోందని ఇప్పటివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాను యానిమల్ సినిమా దాటేసిందని సమాచారం..ట్రైలర్ తర్వాత ఈ సినిమాకి భారీ హైప్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. యానిమల్ సినిమా ఇప్పటివరకు బుకింగ్ అప్డేట్ల విషయానికి వస్తే.. రూ.20.15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని తెలుస్తోంది.


నిన్న మొత్తం 14 కోట్లు గ్రాస్ ఉండగా ఈరోజు 42 శాతం పెరిగిందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. రజనీకాంత్ జైల ప్రీ సేల్ కలెక్షన్స్ మించిపోయిందని జైలర్ సినిమా కేవలం 18.50 కోట్ల క్రాస్ సంపాదించగా సల్మాన్ ఖాన్ టైగర్-3 .. 23 కోట్ల క్రాస్ ను కూడా యానిమల్ సినిమా బీట్ చేయడం ఖచ్చితమంటూ తెలుపుతున్నారు. అలాగే ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా 26.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.


వీటిని కూడా మించే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా రూ.32.43 కోట్ల క్రాస్ వసూల్ సాధించింది అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది దాదాపుగా 41 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. యానిమల్ సినిమా విషయానికి వస్తే దాదాపుగా 3:20 నిమిషాల రన్ టైం తో రాబోతోంది ఇది అభిమానులను చాలా టెన్షన్ పెట్టేలా చేస్తోంది. గతంలో ఇంత రన్ టైం ఉన్న సినిమాలలో RRR, పుష్ప సినిమాలను సైతం అభిమానులు యాక్సెప్ట్ చేశారు మరి యానిమల్ సినిమా ఏం చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: