పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ సీజ్ ఫైర్ 1. ఈ సినిమాను కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్  తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. అలాగే జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావ్ మరియు శ్రియ రెడ్డి వంటి వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు.ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు..కెజిఎఫ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన హోంబలె ఫిల్మ్ ఈ సలార్ ను కూడా తెరకెక్కించింది. తాజాగా సలార్ టీం ఓ పిక్ ను రిలీజ్ చేసింది..ఇదిలా ఉంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్ నిన్న (డిసెంబర్ 1) సాయంత్రం 7.19 గంటలకు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.ట్రైలర్ రిలీజ్ కు ఒక రోజు ముందు గురువారం (నవంబర్ 30) సలార్ టీమ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఈ ఫొటోను షేర్ చేసింది. "బెస్ట్ 5 క్యాప్షన్లకు మీ దగ్గర్లోని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లతోపాటు సలార్ మెర్చండైజ్ కూడా గిఫ్ట్ గా ఇస్తాం. సలార్ సీజ్‌ఫైర్ ట్రైలర్ నిన్న సాయంత్రం 7.19 పేలింది " అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేశారు.ఇక ట్రైలర్ రిలీజ్ పై నెలకొన్న ఉత్కంఠను మరింత పెంచుతూ సలార్ టీమ్ గురువారం (నవంబర్ 30) ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేయడం విశేషం. అధీర ఎడిట్ చేసిన ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు పేలడానికి సిద్ధంగా ఉందంటూ సలార్ టీమ్ ఈ ప్రోమో పోస్ట్ చేసింది.ఈ ప్రోమో ట్రైలర్ పై అంచనాలను మరింత పెంచేసింది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో పిచ్చెక్కించింది. సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ మూవీ డిసెంబర్ 22న ఎంతో గ్రాండ్ గా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: