అక్కినేని ఫ్యామిలీ నుండి పేరున్న నటులుగా ఎదిగింది ఒకటి నాగేశ్వరరావు రెండోది నాగార్జున మాత్రమే. అయితే నాగచైతన్య,అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ వంటి వాళ్లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వీరందరిలో నాగచైతన్య ఓ మోస్తారు గుర్తింపు సంపాదించారు.ఇక సుమంత్ కూడా అప్పట్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయన కెరియర్ అంతగా ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు చేస్తూ కొనసాగుతున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో చాలావరకు మొదటి పెళ్లిళ్లు వారి జీవితాన్ని తారుమారు చేశాయి. నాగేశ్వరరావు మినహా నాగార్జున మొదటి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు.అలాగే నాగచైతన్య కూడా మొదటి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు. ఇక అక్కినేని అఖిల్ కి కూడా మొదట ఎంగేజ్మెంట్ అయి పెళ్లికి కొద్ది రోజులు ఉండగా అది రద్దయిపోయింది.అలాగే సుమంత్ కూడా మొదట కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు. ఇక సుప్రియ సైతం మొదట హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇచ్చింది.ప్రస్తుతం చరణ్ రెడ్డి బతికి లేరు.ఇక వీరందరికీ మొదటి పెళ్లి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు.అయితే నాగేశ్వరరావు మొదట తన కొడుకు నాగార్జునకి పెద్దింటి సంబంధమైన రామానాయుడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ నాగార్జున సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత నాగచైతన్య  విషయంలో ఏఎన్ఆర్ అప్పట్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. తన మనవడికి ఒక స్టార్ హీరో కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని భావించారట. ఇక ఆ స్టార్ హీరో తో కూడా అన్ని మంతనాలు జరిపి పెళ్ళికి ఓకే చేయించారట.కానీ చివరికి నాగచైతన్య సమంతతో ప్రేమలో పడి ఈ పెళ్లిని రిజెక్ట్ చేశారట. ఇక ఏఎన్నార్ తన మనవడికి బాలకృష్ణ చిన్న కూతురు అయిన తేజస్విని  ని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నప్పటికీ నాగచైతన్య వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడంవల్ల ఈ విషయం తెలిసి ఏఎన్నార్ తన నిర్ణయం మార్చుకున్నారట.   కానీ నాగచైతన్య గనుక తన తాతయ్య చెప్పిన మాట వినీ బాలకృష్ణ కూతురు సంబంధం చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన లైఫ్ లో మంచి పొజిషన్లో ఉండేవారు అని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగేశ్వరరావు బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నేను నాగచైతన్యకి బాలకృష్ణ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: