నితిన్ హీరోగా రాబోతున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో జీవిత, జీవితం అంటూ రాజశేఖర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రముఖ రచయిత వక్కంత వంశీ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ పాత్రని ఎంతో ఫన్నీగా డిజైన్ చేశారట వంశీ. ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుంది. నిజానికి నితిన్ మూవీలో రాజశేఖర్ చేస్తున్నారంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనో లేకపోతే విలన్ పాత్రలోనో నటిస్తున్నారని అందరూ అనుకున్నారు.

 కానీ అలా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైనింగ్ ఉన్న పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నారు. అయితే రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ కాకుండా విలన్ రోల్స్ ఎంచుకుంటే ఆయన కెరియర్ కి అది మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని సినీ జనాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ మన టాలీవుడ్ కి విలన్ల కొరత ఉంది. ఆయన తోటి నటులు జగపతిబాబు, శ్రీకాంత్ ఇప్పటికే విలన్స్ గా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో రాజశేఖర్ కూడా అదే దారిలో అడుగులు వేస్తే బాగుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 ప్రజెంట్ రాజశేఖర్ రెమ్యూనరేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. కాబట్టి ఈయన కనుక విలన్ రోల్స్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గోపీచంద్ 'రామబాణం' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల రాజశేఖర్ ఆ సినిమాని వదులుకున్నారట. ఇక నుంచి అయినా ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎంచుకుంటే ఆయన కెరీర్ కి ఏ మాత్రం తిరుగు ఉండదని అభిమానులు అంటున్నారు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. మరి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా ఆయనకి ఎంతలా హెల్ప్ అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: