తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకి తన కథలతో మంచి విజయాలను అందించిన కథ మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్.. రైటర్ గా సక్సెస్ అయ్యక ఆయన డైరెక్టర్ గా మారి వరుసగా సినిమాలు చేస్తూ తన కంటూ ఒక మంచి పేరు ను సంపాదించుకున్నాడు.ఇక ఆయన రీసెంట్ గా అల్లు అర్జున్ తో మరో సినిమా చేయబోతున్నారనే విషయాన్ని ప్రకటించాడు.ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబు తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈయన చేసే సినిమాల వల్ల ఈయన కి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి.ఇక గుంటూరు కారం సినిమా అయితే మహేష్ బాబు అభిమానుల్లో మంచి అంచనాలను పెంచుతుంది.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ రాసిన కథతో బాలయ్య బాబు తన కొడుకు అయిన మోక్షజ్ఞ ని హీరో గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరు అంటే త్రివిక్రమ్ దగ్గర చాలా రోజుల నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక అబ్బాయి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయన చేత ఈ సినిమా డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.  అయితే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని తొందర్లోనే అధికారికం గా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాలయ్య బాబు తన కొడుకు సినిమా ఎంట్రీ అనేది త్రివిక్రమ్ చేతుల మీదు గా చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య కూడా తన కొడుకు సినిమా ఎంట్రీ బాధ్యత మొత్తాన్ని త్రివిక్రమ్ చేతిలో పెట్టినట్టు గా తెలుస్తుంది. అలాగే నువ్వే ఎలాగైనా మావాడితో హిట్ కొట్టించాలి అని చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే మోక్షజ్ఞ భాధ్యత మొత్తం త్రివిక్రమ్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: