తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఊహించని స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల చిరంజీవి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే చిరంజీవి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ విషయం మొత్తం ఫేక్ అంటూ తెలియజేస్తున్నారు.. చిరంజీవి కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవని కూడా తెలియజేస్తున్నారు.



తన మార్కెట్కు అనుగుణంగానే చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలియజేస్తున్నారు. కేవలం చిరంజీవి గురించి కావాలనే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టిస్తూ స్ప్రెడ్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్ విషయంలో 30 నుంచి 40 కోట్ల మధ్య ఉంటుందని పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు. ఇటీవల చిరంజీవి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయని ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రాల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఇటీవల చిరంజీవి విశ్వంభర అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇవి క్రియేషన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. గతంలో డైరెక్టర్ వశిష్ట బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు చిరంజీవితోనే ఒకేసారి తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ వల్ల దిల్ రాజుతో తెరకెక్కించే సినిమా ఆగిపోయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: