రణబీర్ కపూర్, రష్మిక నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం యానిమల్.. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించారు. సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ సినిమాకి కూడా మంచి బజ్ ఏర్పడడంతో ఈ సినిమా మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది.మొదటి రోజే కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టుకుంది. డిసెంబర్ ఒకటవ తేదీన యానిమల్ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది.

ఇప్పటివరకు యానిమల్ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాను థియేటర్లో చూడడానికి అభిమానుల సైతం క్యూ కడుతూ ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు 30 నుంచి 45 రోజులలోపే ఓటీటి లో వచ్చేస్తూ ఉంటుంది.


కానీ రణబీర్ నటించిన యానిమల్ సినిమా ఓటీటిలో విడుదల కావడానికి తాజాగా సిద్ధం అయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి... నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కాబోతుందని విడుదల తేదీని మాత్రం ఇంకా తెలియజేయలేదని తెలుస్తోంది. యానిమల్ సినిమా విడుదలైన కొన్ని గంటలకే ఆన్లైన్లో లీక్ అయినట్లు సమాచారం.పలు వెబ్సైట్లో ద్వారా ఈ సినిమాని పైరసీ విధంగా చూస్తున్నారట. అందుకే ఈ సినిమా పైన సర్వత్ర చర్చ జరుగుతోందని ఏడాది హాట్ సినిమాలలో యానిమల్ సినిమా కూడా ఒకటని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబోతుంది చూడాలి మరి. మరి రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల రూపాయలను కలెక్షన్స్ తో రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: