
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సినిమాలతో ఎలా అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సరికొత్త ట్రెండ్ సృష్టించాడో.. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా కూడా ఇలాగే సరికొత్త దూకుడుతో దూసుకుపోతుంది అని చెప్పాలి. కాగా ఈ మూవీలో అటు రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించేందుకు కూడా రష్మిక వెనకడుగు వేయలేదు. అయితే మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న కంటే ఇక మరో హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రీ తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. తన అందం అభినయంతో ప్రేక్షకుల చూపులు తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సీన్లలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంటిమేట్ సీన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి నాకు కథ చెప్పి సీన్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు అంటూ అడిగాడు. అయితే సినిమాకి ఇంటిమేట్ సన్నివేశం కీలకం కావడంతో నేను అంగీకరించాను. నాకు ఇబ్బంది కాకూడదని షూటింగ్ సెట్లోకి ఎవరిని రానివ్వలేదు. కేవలం సందీప్, కెమెరామెన్ మాత్రమే ఇక షూటింగ్ సెట్ లో ఉన్నారు అంటూ త్రిప్తి చెప్పుకొచ్చింది.