సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం ఊహించినట్లుగానే భారీ సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి మద్దతులేదు.యానిమల్ మూవీలో ఉన్న హింస, శృంగార సన్నివేశాలపై బయట తీవ్రమైన చర్చ, ట్రోలింగ్ జరుగుతోంది. శాడిజం ప్రదర్శించినట్లు అనిపించే సన్నివేశాలని యువతని ఆకర్షించడం కోసమే పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని వర్గాల వారు సినిమాని సినిమాగానే చూడాలి.. యానిమల్ బావుంది అని ఫీడ్ బ్యాక్ ఇస్తుంటే.. మరికొందరు ఇలాంటి చిత్రాలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.ఈ క్రమంలో యానిమల్ మూవీపై ఏకంగా రాజ్య సభలో చర్చ జరిగింది. ఛత్తీస్ ఘడ్ కి చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ రాజ్య సభ్యలో యానిమల్ చిత్ర అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె యానిమల్ చిత్రాన్ని సమాజానికి పట్టిన రోగంగా అభివర్ణించారు.

ఆమె మాట్లాడుతూ యానిమల్ చిత్రంలో మహిళల పట్ల హింస దారుణంగా ఉంది. చాలా అసభ్యంగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలు సమాజంపై ప్రభావాన్ని చూపించగలవు. యానిమల్ మూవీ చూసి న కూతురు ఏడ్చేసింది. ఆ మూవీలో హింస, వల్గారిటీ తారా స్థాయిలో ఉన్నాయి అంటూ రంజీత్ రంజన్ దుమ్మెత్తిపోశారు. నా కూతురు యానిమల్ చిత్రానికి వెళ్ళింది.. కానీ ఏడుస్తూ మధ్యలో వచ్చేసింది.యువతపై ప్రభావం చూపే ఇలాంటి చిత్రాలు అవసరం లేదు అని ఆమె వాదించారు. ఇలాంటి చిత్రాలని ప్రభుత్వాలు ప్రోత్సహించడం కాదు కదా బ్యాన్ చేయాలి అని అన్నారు. పనిలో పనిగా ఆమె పుష్ప చిత్రాన్ని కూడా లేవనెత్తారు. సిక్కు వీరులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన పాటని యానిమల్ లో హింస కోసం వాడుకున్నారు. ఇలాంటి చర్యలని ఏమాత్రం సహించకూడదని రంజీత్ రంజన్ అభిప్రాయ పడ్డారు. యానిమల్ రచ్చ రాజ్యసభ వరకు వెళ్ళింది. ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: