కోలీవుడ్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో శివ కార్తికేయన్ కూడా ఒకరు.. ఎక్కువగా పలు రకాల ఓరియంటెడ్ చిత్రాలపైనే మక్కువ చూపుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఈ నటుడు నటిస్తున్న చిత్రం ఆయలాన్. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. విజువల్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని మేకర్స్ ఇదివరకే తెలియజేశారు.. అయితే సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.



ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆయలాన్ పోస్ట్ ప్రొడక్షన్ పణులు శరవేగంగా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది. అయితే ఇందులో ఒక ఏలియన్ పాత్రను సృష్టించడం జరిగింది. ఈ ఏలియన్ పాత్రకి వాయిస్ ఇవ్వడానికి హీరో సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది చిత్ర బృందం. గతంలో కూడా హాలీవుడ్ మూవీకి సిద్ధార్థ వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయాలను సినిమాలో కూడా తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమయ్యారు.


చిత్ర బృందం సిద్ధార్డ్ కోసం ఒక స్పెషల్ ట్విట్ చేస్తూ థాంక్స్ కూడా తెలియజేయడం జరిగింది.ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రాన్ని రవికుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్తో కోలీవుడ్ లోనే మంచి పాపులారిటీ తెచ్చుకునే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా ఆడియోస్ లోకి ఎంతవరకు తీసుకువెళ్తారా చూడాలి మరి పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమా విడుదల చేయడం జరుగుతోంది.సంక్రాంతికి బారి సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: